ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వాతిముత్యం : సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 09:20 PM

రేపు ఉదయం 11: 07 గంటలకు విడుదల కాబోతున్న "స్వాతిముత్యం" సెకండ్ లిరికల్ సాంగ్ నుండి కొంచెంసేపటి క్రితమే చిన్న టీజర్ విడుదలైంది. డుం డుం డం అని చిన్న పిల్లలు చాలా ముద్దుగా పలికే ఈ కోరస్ డిఫరెంట్ ఫ్లేవర్ తో శ్రోతలను ఆకట్టుకుంటుంది.
బెల్లంకొండ గణేష్ హీరోగా, కొత్త దర్శకుడు లక్ష్మణ్ కే. కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకే గణేష్. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతీ స్వరసాగర్ సంగీతమందించారు. అక్టోబర్ ఐదవ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa