మలయాళ హిట్ మూవీ 'లూసిఫర్(2019)' కి తెలుగు రీమేక్ గా రూపొందిన చిత్రం "గాడ్ ఫాదర్". ఇందులో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ నుండి లేటెస్ట్ గా నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. సత్యప్రియ జైదేవ్ గా నయన్ ఈ సినిమాలో నటించనుంది.
సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై RB చౌదరి, NV ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు.