ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీ 5 చేతికి ఆర్య 'కెప్టెన్' పోస్ట్ థియేట్రికల్ హక్కులు

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 08, 2022, 11:08 AM

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటిస్తున్న చిత్రం 'కెప్టెన్'. తెలుగు, తమిళ భాషలలో ఈ రోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై మంచి అంచనాలను ఏర్పరిచింది.
ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ హక్కులు ప్రముఖ జీ 5 సంస్థ చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది. కెప్టెన్ డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు రెండూ కూడా జీ 5 సంస్థే కొనుగోలు చేసిందట. సో, కెప్టెన్ సినిమా మరికొన్ని వారాల్లోనే జీ 5 ఓటిటిలో అందుబాటులోకి రానుంది.
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఈ చిత్రాన్ని హీరో నితిన్ సమర్పిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com