యంగ్ హీరో నితిన్, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం "మాచర్ల నియోజకవర్గం". ఆగస్టు 12వ తేదీన ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా తొందరగానే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి రాబోతుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ నెల్లోనే మాచర్ల నియోజకవర్గం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. అయితే డేట్ ఇంకా కంఫర్మ్ గా తెలియదు.
శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా మరో హీరోయిన్ గా నటించింది. మహతీ స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.