కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ - బీస్ట్ ఫేమ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో "జైలర్" అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
గత నెల్లోనే ఈ మూవీ అఫీషియల్ గా ఎనౌన్స్ చెయ్యబడింది. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ సర్ప్రైజ్ రివీల్ చేసారు. అదేంటంటే, మూవీ ఎనౌన్స్మెంట్ థీమ్ మ్యూజిక్ ను యూట్యూబ్ మరియు స్పాటిఫై లలో విడుదల చేసారు. అనిరుద్ రవిచంద్రన్ స్వరపరిచిన ఈ థీమ్ మ్యూజిక్ కు శ్రోతల నుండి మంచి స్పందన వస్తుంది.
ఈ సినిమాలో కన్నడ పవర్స్టార్ లేట్ పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.