అందరికీ కావాల్సిన వాడు, అందరి అవసరాలను తీర్చే తీవ్ర ప్రయత్నం చేసేవాడు, ప్రజల బాగోగులే తన సంపదగా భావించే ఉదార స్వభావం గల ఏకైక నాయకుడు, సినీ ప్రపంచంలో లక్షలాది మంది ప్రేక్షకులను తన వీరాభిమానులుగా మార్చుకున్న స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా "నేను మీకు బాగా కావాల్సినవాడిని" మూవీ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ రోజు సాయంత్రం 05:04 నిమిషాలకు ఈ ట్రైలర్ లాంచ్ కాబోతుంది.
ఈ చిత్రంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తుండగా, కొత్తమ్మాయి సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తుంది. దిగ్గజ దర్శకుడు లేట్ కోడి రామకృష్ణ కూతురు దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.