యంగ్ హీరో హీరోయిన్లు రావణ్ నిట్టూరు, నిఖితా అలిశెట్టి నటిస్తున్న చిత్రం "అలిపిరికి అల్లంతదూరంలో". ఈ సినిమా యొక్క టీజర్ ఈ రోజు మధ్యాహ్నం 03:35 నిమిషాలకు విడుదల కాబోతుంది. టీజర్ ను ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు లాంచ్ చెయ్యనున్నారు.
డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద అసిస్టెంట్ గా పని చేసిన ఆనంద్ జే దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్, రాజేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ సంగీతం అందించారు.
ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ గా రిలీజైన తిరుపతి సాంగ్ కు శ్రోతల నుండి విశేష ఆదరణ లభించడంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి.