బెల్లంకొండ గణేష్ మొదటి సినిమా "స్వాతిముత్యం" ఇంకా రిలీజ్ కాకుండానే అప్పుడే రెండో సినిమా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. "నాంది" వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన SV 2 ఎంటర్టైన్మెంట్స్ నాంది సతీష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రేపు ఉదయం 11:34 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తామని కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈ సినిమాకు రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.