ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎమ్ ఎస్ రాజు డైరెక్టర్ గా మారి చేసిన రెండవ చిత్రం "7డేస్ 6నైట్స్". ఇందులో ఎమ్ ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నిన్న అర్ధరాత్రి నుండి తెలుగు ఓటిటి ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా, యూత్ ను ఆకట్టుకునే విభిన్నమైన కధాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో మెహర్ చాహల్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాకు సుమంత్ మరియు రజినీకాంత్ నిర్మాతలుగా వ్యవహరించారు. రోహన్, కృత్తికాశెట్టి కీలక పాత్రలు పోషించారు.