ప్రముఖ సింగర్, ర్యాపర్ యోయో హనీ సింగ్-షాలిని తల్వార్ దంపతులు విడిపోయారు. పదేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే తనను వేధిస్తున్నాడని, ఇతర మహిళలతో ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తపై ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో గతేడాది షాలిని పిటిషన్ వేసింది. తాజాగా వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. భార్యకు కోటి రూపాయల భరణం ఇచ్చేందుకు యోయో హనీసింగ్ అంగీకరించాడు.