ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్ - సల్మాన్ కాంబోలో మూవీ రాబోతోందా...?

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 05:39 PM

మెగాస్టార్ చిరంజీవి, కండలవీరుడు సల్మాన్ ఖాన్ మధ్య ఎప్పటినుండో మంచి స్నేహానుబంధం ఉందనే విషయం అందరికి తెలుసు. ఆ కారణం చేతనే మెగాస్టార్ "గాడ్ ఫాదర్" లో సల్లూభాయ్ స్పెషల్ క్యామియో చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్, వెంకటేష్ ల సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా నటిస్తున్నారని టాక్. ఈ విషయంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ ఈ విషయం పక్కన పెడితే, లేటెస్ట్ గా మరొక ఇంటరెస్టింగ్ న్యూస్ లైమ్ లైట్ లోకొచ్చింది.
అదేంటంటే, చెర్రీ - సల్మాన్ కాంబోలో ఒక భారీ మల్టీస్టారర్ రూపొందబోతుందట. స్క్రిప్ట్ కూడా ఫైనలైన ఈ ప్రాజెక్ట్ ను స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రతిభావంతుడైన డైరెక్టర్ కోసం గాలిస్తున్నారట. మరి , చూడాలి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa