ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' సినిమా ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 06:12 PM

నాగశౌర్య హీరోగా 'కృష్ణ వ్రింద విహారి' అని సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై నిర్మితమైన ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా షిర్లే సెటియా కథానాయికగా ఆరంగేట్రం చేస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా ఈ నెల 23వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.


ముఖ్యమైన పాత్రలను కవర్ చేస్తూ, లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో తల్లిముందు అమాయకంగా కనిపించిన హీరో, ఉద్యోగం కోసం సిటీకి వెళతాడు. తన ఆఫీసులోని అమ్మాయితో ప్రేమలో పడతాడు.

హీరో పెరిగిన వాతావరణానికీ .. హీరోయిన్ పెరిగిన వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఆ తరువాత ఏం జరగనుందనే ఆసక్తిని రేకెత్తించారు. వెన్నెల కిశోర్ .. సత్య కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాధిక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa