నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన "కార్తికేయ 2" ఆగస్టు ఐదవ తేదీన విడుదలై ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చందూ మొండేటి డైరెక్షన్లో ఇండియన్ మిస్టికల్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ఉత్తరాదిన పెను సంచలంగా మారి, కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా కేరళ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 23న మలయాళ భాషలో విడుదల కాబోతుంది. తెలుగు, హిందీ భాషల ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా మలయాళ ప్రజలను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa