ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USAలో 'సీతా రామం' సంచలనం

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 08:00 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా భారీ బిజినెస్ చేసింది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు తాజాగా, ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి ఉన్న డిమాండ్‌ని చూసి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు యూఎస్‌లోని పలు ఏరియాల్లో 30కి పైగా స్క్రీన్‌లను జోడించినట్లు సమాచారం. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa