లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తలపతి విజయ్ నటించిన "మాస్టర్" సినిమా గతేడాది విడుదలై ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తదుపరి లోకేష్ కమల్ హాసన్ తో 'విక్రమ్' తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తదుపరి మరోసారి తలపతిని డైరెక్ట్ చెయ్యబోతున్న లోకేష్ ఆ సినిమా కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట.
అదేంటంటే, ఆ సినిమాలో విజయ్ కు విలన్గా నటించేందుకు KGF అధీర అదేనండి బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ తో చర్చలు జరుపుతున్నారట. ఇంటరెస్టింగ్ టాక్ ఏంటంటే, ఈ రోల్ కోసం సంజుభాయ్ సుమారు పదికోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతానికైతే, విజయ్ వారసుడు /వారిసు తో చాలా బిజీగా గడుపుతున్నాడు. లోకేష్ విజయ్ మూవీ స్క్రిప్ట్ ఫినిష్ చేసే పనిలో ఇంకా చాలా బిజీగా ఉన్నాడు. మరి, సంజయ్ దత్ విషయంలో వస్తున్న వార్తలపై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa