నిన్న సాయంత్రం విడుదలైన గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగల్ ప్రోమో యూట్యూబులో ట్రెండింగ్ వీడియోస్ లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు యూట్యూబులో 3 మిలియన్ కు పైగా వ్యూస్ , 161కే లైక్స్ వచ్చాయి. రేపు విడుదల కాబోతున్న ఫుల్ సాంగ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
మోహన్ రాజా డైరెక్షన్లో మలయాళ సూపర్ హిట్ చిత్రం "లూసిఫర్" కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మెయిన్ లీడ్ లో నటిస్తుండగా, సల్మాన్ ఖాన్ కీరోల్ లో నటిస్తున్నారు. పోతే ఈ చిత్రం అక్టోబర్ ఐదవ తేదీన దసరా కానుకగా తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa