టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడిగా సినీరంగ ప్రవేశం చేసాడు నటుడు సాయిరాం శంకర్. బంపరాఫర్, 143 వంటి విజయవంతమైన సినిమాలు శంకర్ ఖాతాలో ఉన్నాయి.
లేటెస్ట్ గా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం "రీసౌండ్". ఈ రోజు శంకర్ పుట్టినరోజు కావడంతో రీసౌండ్ మేకర్స్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఇందులో శంకర్ లుక్ చాలా పవర్ఫుల్ గా ఉంది. త్వరలోనే ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను పలకరించబోతుంది.
ఈ సినిమాకు ఎస్ ఎస్ మురళీకృష్ణ డైరెక్టర్ కాగా, అమృత హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్, రియల్ రీల్స్ ఆర్ట్స్ సంయుక్త బ్యానర్లపై సురేష్ రెడ్డి, అయ్యప్ప రాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు. స్వీకర్ అగస్తి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. రాశిసింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.