గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం NBK 107 (వర్కింగ్ టైటిల్). ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం టర్కీ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ పోస్ట్ థియేట్రికల్ హక్కులను ఈ సినిమా దక్కించుకుందని టాక్. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 58 కోట్ల వరకు పలికాయట.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ యర్నేని ఈ సినిమాను నిర్మిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa