శ్రీవిష్ణు, కయదు లోహరు జంటగా నటించిన చిత్రం "అల్లూరి". కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. పోలీసాఫీసర్ గా శ్రీవిష్ణు నటన, ఆయన చెప్పే ఇంటెన్స్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. శ్రీవిష్ణు నేకాదు తనికెళ్ళ భరణి, సుమన్ చెప్పే వన్ లైనర్స్ రియలిస్టిక్ గా, ఆలోచించేవిధంగా ఉన్నాయి. దీంతో సెప్టెంబర్ 23న విడుదల కాబోతున్న ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
తనికెళ్ళ భరణి, సుమన్, రాజా రవీంద్ర, 30ఇయర్స్ పృథ్విరాజ్, జయవాణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa