సాంకేతిక లోపాల కారణంగా నిన్న విడుదల కావాల్సిన "ది లైఫ్ ఆఫ్ ముత్తు" సినిమా రెండ్రోజులు వాయిదా పడి రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంలో నిన్న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది. మరి తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
కోలీవుడ్ హీరో శింబు, క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ల కాంబినేషన్లో తెరకెక్కిన ఈ ద్విభాషా చిత్రం ఫీల్ గుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాజిటివ్ రివ్యూలను అందుకుంటుంది. .
సిద్ధి ఇద్నాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వేల్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఇషారి గణేష్ నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ గారు సమర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa