నిన్న విడుదలైన వేగం అనే రొమాంటికల్ లిరికల్ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతుంది. ఇంకా 24 గంటలు కూడా గడవక ముందే 2 మిలియన్ వ్యూస్, 12కే లైక్స్ సాధించింది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే రిలీజ్ అవ్వగా, తొలిసారిగా విడుదలైన ఈ లవ్లీ సాంగ్ కు విశేష ఆదరణ లభిస్తుంది.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచింది.
పోతే, ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa