ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హార్డ్ హిట్టింగ్ గా 'కబ్జా' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 08:48 PM

శాండల్‌వుడ్ స్టార్ హీరోస్ ఉపేంద్ర అండ్  కిచ్చా సుదీప్ ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి 'కబ్జా' అనే  టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. అందరి దృష్టి ఇప్పుడు ఉపేంద్ర నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పైనే ఉంది . 1947 అండ్ 1984 నాటి అండర్ వరల్డ్ చుట్టూ ఈ స్టోరీ వెళ్లనుంది అని సమాచారం. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమా టీజర్‌ను రివీల్ చేశారు. ఉపేంద్ర మరియు కిచ్చా సుదీప్‌ల బ్యాక్‌డ్రాప్, ఎంట్రీ అద్భుతంగా ఉన్నాయి.

ఈ పాన్ ఇండియా మూవీలో మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఎం కామరాజ్, కబీర్ దుహన్ సింగ్, బొమన్ ఇరానీ  కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మోషన్ పిక్చర్, టీజర్, పోస్టర్లు ఈ సినిమా పై భారీ అంచనాలని పెంచేశాయి. శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ 7 భారతీయ భాషల్లో విడుదల కానుంది. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa