ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు ఊర‌ట‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 09:02 PM

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుభవార్త చెప్పింది. 2019 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మోహన్ బాబు తన ఇద్దరు కుమారులతో కలిసి ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ఉండగానే విచారణను నిలిపివేయాలంటూ మోహన్ బాబు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 8 వారాల పాటు విచారణను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa