టాలీవుడ్ లో కొన్నేండ్ల పాటు వెలుగొందిన హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఒకరు. తెలుగులో బడా స్టార్స్ సరసన నటించిన త్రిష ఐదారేండ్లుగా తెలుగు ఆడియెన్స్ కు దూరమైంది. ఆమె చిత్రాలు రాకపోవడంతో అభిమాననులు కాస్తా అప్సెట్ అయ్యారు. కానీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’ చిత్రంతో మళ్లీ అలరించనుంది.ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా త్రిష కృష్ణన్ కూడా తనవంతుగా ప్రమోషన్స్ లో పాలుపంచుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.