యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన 'లైక్ షేర్ సబ్స్క్రైబ్' టీజర్ నిన్న విడుదలైంది. ట్రావెలింగ్ నేపథ్యంలో కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో, యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతుంది.
పోతే, ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు కాగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. నెల్లూరు సుదర్శన్, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.