కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తొలిసారి తెలుగులో డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రం "ప్రిన్స్". తమిళంలో కూడా తెరకెక్కుతున్న ఈ మూవీకి తెలుగు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వం చేస్తున్నారు.
రీసెంట్గా విడుదలైన మొదటి లిరికల్ సాంగ్ సూపర్ హిట్ అవ్వగా, ఇప్పుడు మేకర్స్ సెకండ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రేపు సాయంత్రo ఐదున్నరకు సెకండ్ లిరికల్ సాంగ్ ఐన జెస్సికా ను విడుదల చేస్తున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు.
ఈ సినిమాలో మారియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.