ఎం ఎం కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా, డైరెక్టర్ కం యాక్టర్ సముద్రఖని కీలకపాత్రలో నటించిన చిత్రం "దొంగలున్నారు జాగ్రత్త". నిన్ననే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ ప్రముఖ నెట్ ఫ్లిక్స్ తో డిజిటల్ డీలింగ్ ను కుదుర్చుకుంది. సో, కొన్ని వారాల వ్యవధిలో ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది.
సతీష్ త్రిపుర ఈ సినిమాకు దర్శకుడు కాగా, కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, మంజర్ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి నిర్మిస్తున్న ఈ చిత్రం లో ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa