లక్కీ మీడియా సంస్థలో 9వ చిత్రంగా వస్తున్న ‘హుషారు’. బెక్కం వేణుగోపాల్, రియాజ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. జస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి హీరోలుగా.. దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లుగా నటించారు. రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలో నటించారు. పూర్తి యూత్‌ఫుల్ కథాంశంతో ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కాబోతోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘‘నా జిందగీ.. పచాక్’’ అనే పాటను విడుదల చేశారు. బీ.టెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న రాహుల్ రామకృష్ణ.. పడిన కష్టాలు, ఎదుర్కొన్న అనుభవాలు ఈ పాటలో చూపించారు. వరికుప్పల యాదగిరి పాడిన ఈ పాట, అందులోని సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాయి. రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉన్న ఈ సన్నివేశాలు భలే ఫన్నీగా అనిపిస్తూ హుషారెత్తిస్తున్నాయి. మొత్తానికి ఈ సాంగ్ సినిమాకే హైలైట్ అవుతుందని తెలుస్తోంది. మరోవైపు విడుదలైన కాసేపట్లోనే వేగంగా వ్యూస్ రాబడుతోందీ సాంగ్.
#Pichaak Video Song Now Trending On Youtube From #Hushaaru
https://t.co/OrGgAHihx1
Music, Lyrics & Sung By #VariKuppalaYadaGiri@eyrahul @luckymediaoff @BekkemVenugopal @idineshtej #SreeHarshaKonuganti @abhinavmedi @PriyaVadlamani pic.twitter.com/DyLm9DCSYB
— BARaju (@baraju_SuperHit) November 27, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa