అట్లీ కుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సూపర్ హిట్ వెబ్ సిరీస్ మనీ హైస్ట్ స్టోరీ లైన్ కు ఈ కథ దగ్గరగా ఉంటుందట. దీనికి బన్నీ సానుకూలంగా స్పందించాడని, పుష్ప2 ముగిశాక కొత్త మూవీపై ఫోకస్ చేస్తాడని టాలీవుడ్ టాక్. లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించనుంది. అల్లు అర్జున్ కు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.