ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచు విష్ణు "జిన్నా" టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 07:00 PM

టాలీవుడ్ హీరో, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు నటిస్తున్న 'జిన్నా' నుండి గతంలో ఫ్రెండ్ షిప్ , గోలీసోడా పాటలు రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మరో చార్ట్ బస్టర్ రిలీజ్ కాబోతుంది. నా పేరు జిన్నా రా.. అనే ఈ టైటిల్ సాంగ్ ను రేపు ఉదయం పదకొండు గంటలకు విడుదల చెయ్యనున్నట్టు పేర్కొంటూ, సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ పాటను పృథ్వి చంద్ర ఆలపించారు.
ఇషాన్ సూర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా విడుదలవబోతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa