విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "ఓరి దేవుడా" నుండి నిన్న విడుదలైన అవుననవా అనే బ్యూటిఫుల్ మెలోడీ యూట్యూబులో 1 మిలియన్ వ్యూస్ సాధించింది. హీరో, హీరోయిన్లు బైక్ పై లాంగ్ రైడ్ కి వెళ్లే నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్ ఎంతో మెలోడియస్ గా ఉంది. సిద్ శ్రీరామ్ ఈ పాటకు ప్రాణం పోశారని చెప్పాలి.
మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.