టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. తాజా అప్‌డేట్ ప్రకారం, మాస్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ 50 కోట్లకి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో ఈ విషయం గురించిన అధికారక ప్రకటన మూవీ టీమ్ నుండి వెలువడనుంది అని సమాచారం.
ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ మెగా సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 5, 2022న తెలుగు మరియు హిందీలలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.