ఈ రోజు తెల్లవారు ఝామున సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇందిరాదేవి గారు చివరి శ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ రోజు ఉదయం హఠాన్మరణం చెందారు. దీంతో ఘట్టమనేని ఇంట విషాదపు ఛాయలు అలుముకున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు, ఘట్టమనేని సన్నిహితులు, స్నేహితులు ఇందిరాదేవిగారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. విజయ్ దేవరకొండ, త్రివిక్రం, వెంకటేష్, కొరటాల శివ, మురళీమోహన్, తమన్, నాగార్జున తదితరులు ఇందిరాదేవి గారి భౌతిక కాయానికి నివాళులర్పించారు.
కొంచెంసేపటి క్రితమే మహాప్రస్థానంలో ఇందిరాదేవి గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి.