నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న "మంత్ ఆఫ్ మధు" మూవీ టీజర్ ను సెప్టెంబర్ 29వ తేదీన విడుదల చెయ్యనున్నట్టు సోమవారం ప్రకటించిన మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ టైంను కూడా ఫిక్స్ చేసారు. సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం 10:45 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు.
'త్రిపుర' తదుపరి మరోసారి నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి ఈ సినిమాలో జత కడుతున్నారు. హాట్ స్టార్ స్పెషల్ 'పరంపర' ఫేమ్ శ్రియా నెవిల్ మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్ నాగోతి డైరెక్ట్ చేసారు. అచ్చు రాజమణి సంగీతం అందించారు.