టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఒకటి "భాగమతి". జి అశోక్ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యగా, 2018లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ హిట్ అయ్యింది.
అంతకుముందు అశోక్ నానితో పిల్ల జమిందార్, ఆది సాయికుమార్ తో సుకుమారుడు వంటి చిత్రాలని తెరకెక్కించారు. భాగమతి తదుపరి నాలుగేళ్ల విరామం తీసుకున్న అశోక్ లేటెస్ట్ గా తన కొత్త సినిమాను ప్రకటించారు.
ఓంకార్ డైరెక్టోరియల్ "జీనియస్" లో హీరోగా నటించిన హవీష్ లక్ష్మణ్ ను హీరోగా పెట్టి, అశోక్ 'ఎస్ బాస్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. A స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఆకుల శివ కథ - డైలాగ్స్ అందిస్తున్నారు.