యంగ్ హీరో శర్వానంద్ – సాయి పల్లవిల కాంబినేసన్ లో రూపొందుతున్న మూవీ ‘పడి పడి లేచే మనసు’ . ఈ మూవీ డిసెంబర్ 21న రిలీజ్ కానుంది… ఈ మూవీకి లై ఫేమ్ హను రాఘవపూడి దర్శకుడు. కాగా ఇప్పటికే ఈ మూవీ టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది..కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని ఆర్మాన్ మాలిక్, సింధూరి విశాల్ ఆలపించారు. ఈ సాంగ్ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చాడు. ఈ సాంగ్ అందర్ని ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈ మూవీలోని మరోసాంగ్ కల్లోలంను డిసెంబర్ మూడో తేదిన రిలీజ్ చేయనుంది. చిత్రాన్ని చెరుకూరిసుధాకర్,చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa