ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు గణేష్ "స్వాతిముత్యం" సినిమాతో సినీరంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో హీరోయిన్గా వర్ష బొల్లమ్మ నటిస్తుంది.
పక్కా ఫ్యామిలీ కాన్సెప్ట్ తో ఫన్ కంటెంట్ తో సకుటుంబ సపరివార సమేతంగా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకుని రేపే థియేటర్లకు రాబోతుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. 124 నిమిషాల నిడివితో కూడిన ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గణేష్ కు ఏ మేరకు విజయం సాధించి పెడుతుందో చూడాలి.