ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కెజిఎఫ్'కి యు/ఎ స‌ర్టిఫికెట్ ..

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 08, 2018, 02:18 PM

తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నిర్మిస్తున్న మూవీ కె.జి.ఎఫ్‌. కన్నడ స్టార్‌ యష్‌ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు, తమన్నా ఈ మూవీలో ఐటెం సాంగ్ చేసింది.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఈ నెల 21వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.. ఈ మూవీకి యు/ఎ స‌ర్టిఫికెట్ ల‌భించింది.. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను రేపు హైద‌రాబాద్ లో నిర్వ‌హించ‌నున్నారు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు స‌మాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa