మంచు విష్ణు హీరోగా, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా, డైరెక్టర్ ఇషాన్ సూర్య తెరకెక్కిస్తున్న హార్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ "జిన్నా".
దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన తెలుగు, మలయాళం, హిందీ భాషలలో విడుదల కావడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా నుండి మేకర్స్ కొంచెంసేపటి క్రితమే పెంచలయ్యను పరిచయం చేసారు. పెంచలయ్య పాత్రను సునీల్ పోషిస్తుండగా, ఆ పాత్రతో సినిమాలో నవ్వుల పువ్వులు పూయడం ఖాయమని రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా అర్ధమవుతుంది.
కోన వెంకట్ కథను అందించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్త బ్యానర్ లపై విష్ణు మంచు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.