అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "ఉర్వశివో రాక్షసివో". ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ లా ఉండనున్న ఈ పాటను సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు.
పూర్తి పాట అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. రాకేష్ శశి డైరెక్షన్లో నేటి తరం ఆధునిక ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
అల్లు అరవింద్ సమర్పణలో, ధీరజ్ మొగిలినేని, విజయ్ M ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.