యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన కొత్త చిత్రం "క్రేజీ ఫెలో". ఈ సినిమాతో ఫణికృష్ణ సిరికి అనే కొత్త డైరెక్టర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు.
అక్టోబర్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధపడిన ఈ మూవీ లేటెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు అక్టోబర్ 9వ తేదీన సాయంత్రం ఐదు గంటల నుండి హైదరాబాద్లోని దసపల్లా కన్వెన్షన్స్ లో క్రేజీ ఫెలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
దిగాంగాన సూర్యవన్షి, మిర్ణా మీనన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువ సంగీతం అందిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్నారు.