నందమూరి నటసింహం బాలకృష్ణ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో NBK 107 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే కీలక టర్కీ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే ఆహా టాక్ షో "అన్ స్టాపబుల్ విత్ NBK 2" షూటింగ్ లోను బాలయ్య పాల్గొనబోతున్నారు. ఆపై ఎలాగూ, డైరెక్టర్ అనిల్ రావిపూడి లైన్లోనే ఉన్నాడు.
వీటన్నిటి తరవాత బాలయ్య డైరెక్టర్ కొరటాలతో సినిమా చెయ్యబోతున్నారని వినికిడి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నారట. ఐతే, ఈ విషయం పై అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.