బాలీవుడ్ నటి శ్రద్ధా దాస్ తన గొంతు సవరించి ఓ పాటని పాడింది. సాంగ్ రికార్డింగ్ వేళ రికార్డింగ్ స్టూడియోలో దిగిన ఫోటోల్ని శ్రద్ధ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు షేర్ చేసింది. శ్రద్ధలో నటి మాత్రమే కాదు గాయని కూడా.. తొలిసారిగా పూణే ఫిడిల్ క్రాఫ్ట్ -ఎన్ డి స్టూడియోలో అమిత్ అధికారి సంగీత సారథ్యంలో పాటను ఆలపించానని శ్రద్ధ దాస్ వెల్లడించింది. కాగా ఆమె రిలీజ్ చేసిన ఫోటోలలో ఈ అమ్మడు బొద్దుగా కనిపించి అందర్ని ఆకట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa