మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పదిహేనవ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, RC 15 కొత్త షెడ్యూల్ అక్టోబర్ 10 అంటే సోమవారం నుండి ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఆరు రోజుల పాటు జరగనుందట. ఈ షార్ట్ షెడ్యూల్ లో ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సీన్స్ ను చిత్రీకరించబోతున్నారట.
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, కోలీవుడ్ డైరెక్టర్ కం యాక్టర్ SJ సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa