కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'సూర్య 42' (వర్కింగ్ టైటిల్). సూర్య కెరీర్లో 42వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ హిస్టారికల్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.
ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శిరుతై శివ డైరెక్టర్ కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పది భాషల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కాబోతున్న ఈ మూవీలో సూర్యకు జోడిగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని నటిస్తుంది.
గత కొన్ని రోజుల నుండి గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా ఆ షెడ్యూల్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసారు. ఈ మేరకు సూర్య 42 మూవీ టీమ్ అంతా కలిసి కెమెరాకు ఫోజులిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa