తమిళ హీరో శివకార్తికేయన్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో డైరెక్ట్ తెలుగు మూవీ తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'ప్రిన్స్' అని టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కామెడీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం 2 గంటల 23 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉంది అని సమాచారం.
ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా జోడిగా కనిపించనుంది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబుతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తమిళ-తెలుగు మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa