AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివారులోని PVSR గోడౌన్లో వైసీపీ నేత శివరామిరెడ్డిపై ముసుగు ధరించిన టీడీపీ శ్రేణులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో శివరామిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. తనపై అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ దాడి చేశాడని, తనను చంపడానికి ప్రయత్నించారని బాధితుడు తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి.. అఖిలప్రియ తన భర్త డబ్బుల కోసమే ఈ దాడి చేయించారని విమర్శించారు. శివరామిరెడ్డిని అత్యవసర చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa