RRR తదుపరి జూనియర్ ఎన్టీఆర్ నటించే సినిమాపై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. RRR వంటి గ్రాండ్ పాన్ ఇండియా సక్సెస్ తదుపరి కొరటాల శివ తో తారక్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ కు కమిటైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని నందమూరి అభిమానులు వేకళ్ళతో ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, నవంబర్ రెండవ వారంలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుందట. అలానే డిసెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుందట. మరైతే, ఈ విషయాలపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa