ఈ మధ్య వార్తల్లో బాగా పాపులరైన విషయం ఏదైనా ఉంది అంటే అది... కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార పెళ్ళైన నాలుగు నెలలకే తల్లి కావడం.
జూన్ 9వ తేదీన అట్టహాసంగా వివాహం చేసుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు అక్టోబర్ 9వ తేదీన తాము ఇద్దరు కవలలకు తల్లితండ్రులయ్యాం అంటూ సోషల్ మీడియా ద్వారా తెలపడం చర్చనీయాంశం అయ్యింది. దీంతో అందరూ సరోగసి విధానం ద్వారా నయన్ మాతృత్వం పొందింది అని అనుకున్నారు. దీంతో ఆమె సరోగసి విధానాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు పాటించిందా ? ఏవన్నా అవకతవకలున్నాయా ? ఇలాంటి విషయాలు తేల్చడానికి తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో నయనతార పూర్తి చట్టబద్ధంగా సరోగసి విధానాన్ని పాటించినట్టు పేర్కొన్నారు. అలానే నయన్, విఘ్నేష్ దంపతులకు 2016 మార్చి 11 వ తేదీన వివాహం అయ్యిందని, 2021 నవంబర్ లో సరోగసి పై అగ్రిమెంట్ చేసుకున్నారని పేర్కొంది.
![]() |
![]() |