డైరెక్టర్‌ను నమ్ముకోవడం వల్లనే ఆరెంజ్ సినిమా నష్టాలొచ్చాయని నటుడు నాగబాబు ఆ చిత్ర చేదు రుచులను నెమరేసుకున్నారు. అప్పటి కష్టాల గురించి ఇప్పుడు చెప్పడం సరికాదంటూనే డైరెక్టర్ నమ్ముకోవడం వల్లనే నష్టాలు వచ్చాయంటూ వాపోయారు.
నేను ఏనాడు చవిచూడని పరిస్థితి ఆ చిత్రం విడుదల తదుపరి చూసాను. సినిమా రిలీజ్ తర్వాత నేను నష్టపోయిన మొత్తం తెలిసి నేను షాక్ తిన్నాను. నా కెరీర్‌లో ఎదురైన ఆ పరిస్థితి ఎన్నడూ కలలో కూడా ఊహించలేనిది. జీవితంలో ఎప్పుడూ అనుభవించలేనిది కూడా అని చెప్పారు. అప్పటికి నాకున్న ఆస్తులన్నీ అమ్మినా ఆ సినిమా కోసం నేను చేసిన అప్పులు తీర్చలేనిదిగా తయారైందని నాగబాబు గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంతో ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నటంతో ఒకానొక సమయంలో ఓ దశలో అఘాయిత్యం చేసుకోవాలనుకున్నా, క్షణికావేశానికి లోనయ్యాను. తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన వచ్చిందని ఆయన వెల్లడించారు.
అలాంటి కష్టాల్లో తను మునిగిపోయిన సమయంలో తమ్ముడు పవన్ కల్యాణ్ బాగా సపోర్ట్ ఇచ్చిన సేదతీర్చాడు. ఆ తర్వాత అన్నయ చిరంజీవి మద్దతుగా నిలవటంతో నిలదొక్కుకున్నా నా జీవితంలో ఎప్పుడూ మరువలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్లు నా సోదరులే. వాళ్లే నాకు ప్రాణం. వాళ్లని ఎవరు ఏమన్నా తట్టుకోలేనని తేల్చి చెప్పారు నాగబాబు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa